.కోయిలమ్మ - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
హైదరాబాద్
కవితసంఖ్య...250
అంశం..కోయిలమ్మ - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
శీర్షిక...ఆ పాట మధురం
--------------------------------
శిశిర ఋతువులో ఆకులురాలి
వసంత ఋతు ఆగమనంతో నూతనత్వాని సంతరించుకుని
చిగురులు వేసే తరువులు!!
లేత మావి చిగుళ్లు తిని
మత్తెక్కిన గండుకోయిల
ఆలపించే మధురగానం
ఆమనికి స్వాగతగీతం!!
కూ అంటే కుహుకుహు అని
మనతో జత కలిపి
గొంతు సవరించుకుని
పాడే కోయిలమ్మ అందరి మనసును దోచిన గాన గాంధర్వపక్షి!!
కనిపించకుండా కొమ్మలో దాక్కుని
దాని కమనీయ నీల వర్ణ మేని సొగసుకు
ఆకర్షణీయమైన కంఠం దానికున్న ఆభరణం
అదే మనకు వరం!!
కాకి కోకిల రూపొకటైనా
కొమ్మ కొమ్మకు కమ్మని
గాన సొబగులు అద్దుతూ
గాన మాధుర్యంతో మైమరపించే
కోకిలమ్మా నీకు నీవే సాటి
పక్షుల్లో మేటి...!!
Comments
Post a Comment