కోకిలమ్మ - కళావతి కందగట్ల....

కోకిలమ్మ  -  కళావతి కందగట్ల....
కవిత సంఖ్య...155
శీర్శిక...పచ్చని ప్రకృతి


కోయిలమ్మా !
దిగులెందుకమ్మా
కుహూ కుహూ రాగాలు
నీ నోట
వినిపించవేమిటమ్మా

గున్నమామిడి చెట్టు
గుబురు కొమ్మల్లోన
లే చివుళ్ళు తింటూ
మత్తు గా నీవు
మధుర గీతాలు పాడే
ఓ కోయిలమ్మా
నీకు దిగులెందుకమ్మా !

పచ్చదనం పలుచ బడిందని
వగచుతున్నావా ?
పచ్చని చెట్లను నరికి వేస్తున్నారని బాధ
పడుతున్నావా ?

రాబోయే కాలంలో
మీకు నిలువ నీడ
లేక పోతుందని
ఆవేదన చెందుతున్నావా?

మనిషి స్వార్థపూరిత
ఆలోచనలతో ప్రకృతికే
హాని తలపెట్టి తన గోతిని
తానే తవ్వుకుంటున్నాడు

తన తప్పు తెలుసుకునే రోజు
త్వరలోనే వస్తుంది
పచ్చని చెట్లను పెంచుతూ
ప్రకృతికి ప్రణమిల్లుతాడు

ఓ కోయిలమ్మా
ఇక దిగులెందుకమ్మా
నీ కుహూ కుహూ రాగాలతో
పచ్చని ప్రకృతిని పరవశింప
చేయమ్మా !

కళావతి కందగట్ల

Comments