సురక్షా గీతం - ఏడెల్లి రాములు
ఏడెల్లి రాములు
* సురక్షా గీతం - ఏడెల్లి రాములు
చిన్ని చిన్ని మువ్వల ఆశ
చిత్రమే ఇది చిన్ని పువ్వు శ్వాస
శరమే కదా శరీరం
విల్లు వంచితేనే శరపరంపర శస్త్రం
ఇల్లైనా విల్లైనా కళాత్మకం
యోగమైనా ఆసనమైనా
శరీర ధర్మ సంరక్షణం
పాంచభౌతిక ఇహం
పంచభౌతిక శరీరం
తాదాత్మ్యమే తన ధ్యానం
పంచేంద్రియాలకు పగ్గం
ధారణ యమ నియమం
తా ఋషియై మహర్షి గా
తపోవన ఉషస్సే యశస్సు
మనసు కట్టడి మంత్రం ధ్యానం
మనిషి ఆరోగ్య సూత్రం యోగాసనం
నిత్య ఆదిత్యారాధనయే
మనోమయ సుమగీతం
సూర్య నమస్కారాలే
ఆరోగ్య సంరక్షణ లో శ్రీ రామ రక్ష
ఓ శ్లోకం చదువూ
శోకం దూరం చేయు
ఓ శాంతి మంత్రం
ఇలకు సౌశీల్య సారథ్యం
నా తల్లి భారతీ ఒడి
సంగీత సాహిత్య దర్శనం
యోగా ముద్రా సమ్మేళనం
మనిషిని మనీషిగా మార్చే
శిల్ప రూప నవీనత
ప్రపంచానికి పరిచయ ప్రధాత
శాంతికీ క్రాంతికీ ప్రగతి విధాత
అనుసరించడమే మానవ ధర్మం
మనో వికారాలను త్రుంచడమే
నేటి కర్తవ్యం
* సురక్షా గీతం - ఏడెల్లి రాములు
చిన్ని చిన్ని మువ్వల ఆశ
చిత్రమే ఇది చిన్ని పువ్వు శ్వాస
శరమే కదా శరీరం
విల్లు వంచితేనే శరపరంపర శస్త్రం
ఇల్లైనా విల్లైనా కళాత్మకం
యోగమైనా ఆసనమైనా
శరీర ధర్మ సంరక్షణం
పాంచభౌతిక ఇహం
పంచభౌతిక శరీరం
తాదాత్మ్యమే తన ధ్యానం
పంచేంద్రియాలకు పగ్గం
ధారణ యమ నియమం
తా ఋషియై మహర్షి గా
తపోవన ఉషస్సే యశస్సు
మనసు కట్టడి మంత్రం ధ్యానం
మనిషి ఆరోగ్య సూత్రం యోగాసనం
నిత్య ఆదిత్యారాధనయే
మనోమయ సుమగీతం
సూర్య నమస్కారాలే
ఆరోగ్య సంరక్షణ లో శ్రీ రామ రక్ష
ఓ శ్లోకం చదువూ
శోకం దూరం చేయు
ఓ శాంతి మంత్రం
ఇలకు సౌశీల్య సారథ్యం
నా తల్లి భారతీ ఒడి
సంగీత సాహిత్య దర్శనం
యోగా ముద్రా సమ్మేళనం
మనిషిని మనీషిగా మార్చే
శిల్ప రూప నవీనత
ప్రపంచానికి పరిచయ ప్రధాత
శాంతికీ క్రాంతికీ ప్రగతి విధాత
అనుసరించడమే మానవ ధర్మం
మనో వికారాలను త్రుంచడమే
నేటి కర్తవ్యం
Comments
Post a Comment