కోకిలమ్మ. -డా.కె.ఎల్.వి.ప్రసాద్

అంశం <<>>కోకిలమ్మ. -డా.కె.ఎల్.వి.ప్రసాద్
శీర్షిక <<>>,గా న రవళి *
కవి<<>>డా.కె.ఎల్.వి.ప్రసాద్

గాన రవళి *

ఆ ..స్వరం ,
ఎక్కడో విన్నట్టుగా ఉంది .
విన్నకొద్దీ ..
వినాలనిపించే ఆ ..స్వరం,
ఉగాది ఆగమనాన్ని సూచిస్తూ
ఊరూరా ...
మధుర గీతాలని ,
అహ్లాదంగా ఆలపించినట్టు ఉంది ,
కమ్మని ...
కోకిలమ్మ గానంలా ఉంది !

పూల పరిమళంలా ...
వాయువేగంతో పోటీపడుతున్న ,
ఆ ..స్వరమాధుర్యం,
నేనుకోరుకున్న ..
నా ..ప్రియ సఖి ....
ఆనంద గమనపు ...
అనవాళ్ళు లా ...
నాకు హెచ్చరికల
పంపిస్తున్నాయ్ ...!

నిజమే ...అది,
అల్లంత దూరాన నిలబడి ,
చెలికత్తెలతో ...
సరస సంభాషణల్లో
నిలువెత్తు మునిగిపోయిన ,
ఆ ..కోమలి ...
మధుర సంభాషణమే !
ఆ ..కోకిలమ్మ ...
మధుర గాన రవళి లా ,
హృదయ భాషతో
మత్తిల జేస్తున్న
నా ..మానస ...
పూబోణిదే ....!!

__ డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
           హనంకొండ.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి