కోకిలమ్మ - అనూశ్రీ


కవిత సంఖ్య~~188
అంశం~~కోకిలమ్మ  -  అనూశ్రీ
శీర్షిక~~కోకిలమ్మ
~~~~~
కొమ్మకొమ్మకూ నేర్పింది
కమ్మనైన రాగం...
మది మదిలోనూ కురిపించి
మధురమైన గానం...

వసంతానికి స్వాగతమంటూ
పూలవనాల కచేరీచేస్తూ
మరింత ఆహ్లాదాన్ని పంచుతూ...

 కుహూకుహూ స్వరాలలో
సరిగమలన్నీ వినిపించేలా
ఆలాపిస్తుంది ఏన్నేళ్ళయినా
పాతదవని నవగీతమై....

ఎంతవిన్నా తనివి తీరని
గానామృతాన్ని
పచ్చని కొమ్మ పల్లకిలో
ఊరేగుతూ పంచుతోంది
మనసులు మురిసేలా....

మావిచివురుల గుబురుల్లో
మసకచీకటి రంగులో
మాధుర్యానికి మారుపేరై
ఆమనికి తీయని వరమైంది కోకిలమ్మ...!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి