కోకిలమ్మ - రాయవరపు సరస్వతి
కవిత సంఖ్య: 205
అంశం: కోకిలమ్మ - రాయవరపు సరస్వతి
శీర్షిక: వసంత గానం
*********
వసంతమాసంలో విరబూసే
ప్రకృతివణాలతో పా టూ
కోయిలమ్మ
ఆనందపారవశ్యంతో
పాడే తీయని గానం
వినసొంపుగా
వీనులవిందుగా
మనసు పులకించి
తరింపజేసింది,
కోకిలమ్మ నల్లనిదైనా
గానం మధురాతి మధురం,
ప్రకృతిలో వినిపించే ఆ తీయని
గానం తో జంతుమృగాలు సైతం
శిల వంటి కఠిన హృదయులు
కూడా వెన్నలా కరిగిపోవలసిందే,
కోకిలమ్మ వయ్యారాలు పోతూ
కూసే తీయని గానంతో
సురలోకవాసులుకుడా మురిసి
మైమరచి వరుణుడు దయ తలచి
కురిపించే వర్షాధారతో భూదేవి
సంతసించి సకల ప్రాణికోటికి
అన్న దాహార్తులను సమకూర్చి
చల్లని దీవెనలు ప్రసాదిస్తుంది,
**********
రాయవరపు సరస్వతి
చోడవరం, విశాఖా
Comments
Post a Comment