కోకిలమ్మ - మాధవీసనారా
అంశం:కోకిలమ్మ - మాధవీసనారా
శీర్షిక:కోకిల నా కిష్టం
కవిత సంఖ్య:165
^^^^^^^^^^^^^^^^^^^^^
చైత్రమాసంలో విడుదలయ్యే
వసంతరుతు చిత్రానికి
కోయిలపాటే నేపధ్య సంగీతం
కుహు కుహు అనే రెండు మాత్రల
వసంతగీతమాలపించే గాయని
గుబురు సామ్రాజ్య ఆస్థాన సంగీత విద్వాంసురాలు
మావిచిగురు తినగానే గాత్రశుద్ధి జరుగుతుందో ఏమో
గొంతెత్తి పాడుతుంది
మావిడాకుల శ్రోతలు కనబడగానే పరవశించి పాడుతుంది
ఏ బాదరబందీ తలకెత్తుకోకుండా
సహజీవనంతో
గడిపే
ఆధునిక యువతకి మార్గదర్శి
అండం పొదిగే విద్య తెలియని అమాయకురాలు
పుట్టని పిల్లకి లాలిపాడే తల్లికాని తల్లి కోయిలమ్మ
చినుకు
చాతకపక్షికి
చిగురు
కోయిలమ్మకి ప్రీతి
కాకి కంసుడి ఖైదులో జన్మించే
కోకిల కన్నయ్య గానమంటే ఇష్టపడనిదెవరు
కవులకి మరీ ప్రీతి కోయిలమ్మంటే
నాకు వసంతమంటే ఇష్టం
కోయిల కూజితమంటే మరీ ఇష్టం.
మాధవీసనారా, అనకాపల్లి
విశాఖపట్టణం జిల్లా
శీర్షిక:కోకిల నా కిష్టం
కవిత సంఖ్య:165
^^^^^^^^^^^^^^^^^^^^^
చైత్రమాసంలో విడుదలయ్యే
వసంతరుతు చిత్రానికి
కోయిలపాటే నేపధ్య సంగీతం
కుహు కుహు అనే రెండు మాత్రల
వసంతగీతమాలపించే గాయని
గుబురు సామ్రాజ్య ఆస్థాన సంగీత విద్వాంసురాలు
మావిచిగురు తినగానే గాత్రశుద్ధి జరుగుతుందో ఏమో
గొంతెత్తి పాడుతుంది
మావిడాకుల శ్రోతలు కనబడగానే పరవశించి పాడుతుంది
ఏ బాదరబందీ తలకెత్తుకోకుండా
సహజీవనంతో
గడిపే
ఆధునిక యువతకి మార్గదర్శి
అండం పొదిగే విద్య తెలియని అమాయకురాలు
పుట్టని పిల్లకి లాలిపాడే తల్లికాని తల్లి కోయిలమ్మ
చినుకు
చాతకపక్షికి
చిగురు
కోయిలమ్మకి ప్రీతి
కాకి కంసుడి ఖైదులో జన్మించే
కోకిల కన్నయ్య గానమంటే ఇష్టపడనిదెవరు
కవులకి మరీ ప్రీతి కోయిలమ్మంటే
నాకు వసంతమంటే ఇష్టం
కోయిల కూజితమంటే మరీ ఇష్టం.
మాధవీసనారా, అనకాపల్లి
విశాఖపట్టణం జిల్లా
Comments
Post a Comment