కోకిలమ్మ - నగునూరి రాజన్న
అంశం -కోకిలమ్మ - నగునూరి రాజన్న
తేదీ - 21-06-2019
శీర్షిక - సృష్టి సమ భావన
సంఖ్య -217
శిశిరంలో ఆకురాల్చి వసంతంలో చిగురించగానే
పిలవని పేరంటమై పండగలా వస్తావు ఆమని అతిథిగా
చివురాకుల నేస్తమై కూనిరాగాలు తీస్తావు
ఎద ఎదలో మధురానుభూతులు నింపేస్తావు
రూపు నల్లనైనా నీ రాగమెంతో చల్లన
పిల్లలంతా నిన్ను అనుకరించి ఆటపట్టించినా
కొమ్మ కొమ్మన దాగుడుమూతలాడి అలరిస్తావు
పిల్లలు కేరింతలతో ఆనందిస్తే మురిసిపోతావు
అంత మధురమైన కంఠమిచ్చిన దేవదేవుడు
ఆ కాకి రూపం ఎందుకో ... నలుపు రంగు ఏలనో.......
ప్రపంచమేలే పంచ కళ్యాణి పలుకులు నువ్వు పంచితే
బహుశ పిల్లల పొదిగి పెంచే పని కాకమ్మకు ఒప్పగించ కాబోలు...
ఆశతో ఎదురుచూసే మాకు ఋతుపరంగానే వస్తావు
పండగ అందాలు సందడి ఆనందాలు ఇనుమడిస్తావు
సృష్టిలో సర్వస్వం సమ భావన సంకేతమల్లె
నీ రాగాలాపన మిగతా కాలం అభ్యసించమనా....
ఏదైతే ఏం లే... నీ పేరు మీద బిరుదులే ఇస్తారు మనుషులకిక్కడ...
Comments
Post a Comment