కోయిలమ్మ - సోంపాక సీత


కవిత సంఖ్య: 185
అంశం : కోయిలమ్మ  -  సోంపాక సీత
శీర్షిక: కోయిలే ఆదర్శం
********

నడిచే రైలుకు నల్లనిబొగ్గే ప్రాణశక్తై నిలిచెగదా
నల్లని మబ్బులె రైతు హృదిలో నవ్వులజల్లులు పంచెగదా....

నల్లని అగరే నవ్వేపాపకు దృష్టి చుక్కగ అమరెగదా
రాతిని నాతిగ మార్చిన ఆ వైకుంఠ రాముడు నలుపుగదా....

నల్లని రాళ్లే నలుగురూ మెచ్చే శిల్పాలై మురిసెగదా
నారాయణుడే మెచ్చుననే శాస్త్రము నలుపుకు వుంది గదా....

నల్లనికురులే చక్కగవుంటే నయనానందం ఒలికించుగదా
కోయిల వర్ణం నలుపే అయినా గానమెంతో సొగసుగదా....

పక్షి జాతిగా పుట్టినగానీ విజ్ఞాన మెంతోమెండుగదా
కోయిల దారిన నడిచే నరులు ఇలకే ఆదర్శమౌనుగదా ....

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి