కోకిలమ్మ - కోణం పర్శరాములు


చరవాణి : 9959524585
అంశం : కోకిలమ్మ  -  కోణం పర్శరాములు
కవిత  సంఖ్య : (303)
శీర్షిక : కమ్మని పాటల కోకిలమ్మ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
చైత్రశుక్ల పాడ్యమి మాసములో
ఆమని వసంత రాకతో కేరింతలు కొడుతూ...
నవ వసంతానికి స్వాగతం పలుకుతూ
గున్న మామిడి కొమ్మల మీద
పచ్చని హరితాల మాటున
దాగిన ఓ.. కోకిలమ్మ
మామిడి తోరణాలలో ఊయలలూగుతూ
లేతమావి చిగుళ్ళను తింటూ
మామిడి పిందెలు ఒగర్లచేత
కమ్మని పాటలు మూటలచేత
కుహు కుహు అని తీయటి
పాటలు మత్త కోకిలవు నీవు
సహజ సంగీత విద్వాంసు రాలువి నీవు.
నీకు నీవే పల్లవి నీకు నీవే చరణం
సంగీత సరిగమల చేత పిల్లల
మనసు కుదుట పరుస్తావు
కుహూ కుహూ అని పాడే నీ పాటకు పిల్లలే పల్లవౌతారు
కూడు ఇచ్చిన ఆదేవుడు నీకు
గూడు ఎందుకియ్యలేడో ?
తీయని గాత్రాన్ని ఇచ్చిన ఆ
భగవంతుడు నీకు ఆ నల్లని
రూపాన్ని ఎందుకిచ్చాడో ?
అండాన్ని ఇచ్చిన ఆ దేవుడు
గుడ్లపై పొదిగితే భాగ్యం ఎందుకు ఇవ్వలేదో ?
అమ్మ తనాన్ని ఇచ్చిన దేవుడు
అమ్మ ప్రేమను ఎందుకివ్వలేడో
సప్తస్వరాలను ఇచ్చిన దేవుడు
స్వర్గ సుఖాలు ఎందుకివ్వ లేడో
నీ జీవితం సుఖదుఃఖాల సంగమం
కన్నీరుకు పన్నీరుకు మధ్యన
ఆనంద భాష్పాల అశ్రుధారల
జీవిత అంకం నీది
అందరిని అలరించే ఓ కోయిలా
ఆనందాల బృందావనం కావాలి నీ జీవితం.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి