కోకిలమ్మ - జయంతి సుధాకర్.


సంఖ్య.54
అంశం..కోకిలమ్మ  -  జయంతి సుధాకర్.
శీర్షిక...వసంత కోకిల.
********

ప్రకృతి పులకించి...
వసంతం చిగురిస్తే,
ఆనందంగా గళo..
సవరించిన కోయిల
అతిథిలా విచ్చేసి,
కమ్మని గానం తో
వీనుల విందు చేస్తుంటే,
అభినందనలంటూ..
నింగిలో సింగిడి,
నాట్యమాడింది.

బేద భావాలు లేని,
కోకిలమ్మ వాణి
కాకమ్మ గూడులో,
సూరీడు సాక్షిగా
గుడ్లన్ని పొదగేసి,
ఐకమత్యానికి...
ఆనవాళ్లు చూపింది.

వర్ణానికి తెర వేసి
గళానికి గాళమేసి,
వర్ణిస్తే ,
కోకిల గానామృతం
ఆమనినీ పులకరించి
వసంతానికి...సాదరంగా
స్వాగతమీయదా....
మదువొలకబోస్తూ!!!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి