కోకిలమ్మ -మద్దెల సరోజన
మద్దెల సరోజన (కలం: సహజ)
క్రమ. సం: 81
అంశం: కోకిలమ్మ -మద్దెల సరోజన
శీర్షిక: వసంత గాన కోయిల
"""""""""""""""""""""""""""""""""""""""""""""
స్వస్థలాన్ని వీడి
పర ప్రాంతం చేరి
తన పర బేధం మరచి
షడ్రుచులు మేళవింపైన
కుహూకుహూ రాగాలాపనతో
నవ వసంతుడికి స్వాగతం పలికే
వలస సంగీత రాణి కోకిలమ్మ
రాగాల వీణగా కర్ణానందం కలిగిస్తూ
మావితోటల్లో చివురులు తింటూ
చిలిపి పాటలతో హాయిని పెంచు
మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ
తుంటరి పిల్లలతో గొంతు కలపే
గడసరి సొగసరి పంతులమ్మ
కాకి కోకిలలు తోబుట్టువులు కాదే..ఐనా
కాకి గూటిలో గ్రుడ్లు పెట్టి
సమతమమతలు చాటే సమన్విత
అవనికి ఆమని సొగసులు తెచ్చే
ప్రకృతికే పాటలు నేర్పే
సంగీత విద్వాంసురాలు
సదా వసంతాన్ని ఆహ్వానించే
సహృదయ వసంత గానకోయిల
క్రమ. సం: 81
అంశం: కోకిలమ్మ -మద్దెల సరోజన
శీర్షిక: వసంత గాన కోయిల
"""""""""""""""""""""""""""""""""""""""""""""
స్వస్థలాన్ని వీడి
పర ప్రాంతం చేరి
తన పర బేధం మరచి
షడ్రుచులు మేళవింపైన
కుహూకుహూ రాగాలాపనతో
నవ వసంతుడికి స్వాగతం పలికే
వలస సంగీత రాణి కోకిలమ్మ
రాగాల వీణగా కర్ణానందం కలిగిస్తూ
మావితోటల్లో చివురులు తింటూ
చిలిపి పాటలతో హాయిని పెంచు
మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ
తుంటరి పిల్లలతో గొంతు కలపే
గడసరి సొగసరి పంతులమ్మ
కాకి కోకిలలు తోబుట్టువులు కాదే..ఐనా
కాకి గూటిలో గ్రుడ్లు పెట్టి
సమతమమతలు చాటే సమన్విత
అవనికి ఆమని సొగసులు తెచ్చే
ప్రకృతికే పాటలు నేర్పే
సంగీత విద్వాంసురాలు
సదా వసంతాన్ని ఆహ్వానించే
సహృదయ వసంత గానకోయిల
Comments
Post a Comment