కోకిలమ్మ - :వై.కె.సంధ్యశర్మ
ఊరు: చిత్తూరు
సంఖ్య:.85
అంశం : కోకిలమ్మ - :వై.కె.సంధ్యశర్మ
శీర్షిక : ఓ కోయిలమ్మ!
వసంత నీరీక్షణలో
మొండి మొలలతో
నిలబడ్డ వృక్షాలను
అడిగింది
ఓ కోయిలమ్మ
కానరాని పచ్చదనానికి
కారణమేమని
చివుళ్ళేయని
చిటారుకొమ్మల
నడుమ ఆకులేవని
పండు వెన్నెల్లా కాసే
ఫలాలేవని!
పక్షుల కువకువల
కూని రాగాలు
రామచిలుకల పలుకులు
కాకమ్మ కబుర్లేవని!
బుర్రుపిట్టలు తుర్రుమనే
చెట్టు తొర్రలేవని
గువ్వల గుంపుల
గూళ్ళేవని!
వయ్యారి ఉడుతల
అల్లరేదని
వడ్రంగి పిట్టల
వలపు పిలుపులేవని
వానరతోకల
కథలేవని!
గరుత్మంతుని కాలి జాడలేవని!
పావురాళ్ళ పొదరిళ్ళేవని!
కాటుక కళ్ళ కోయిలమ్మ
కన్నీరొలికింది!
గతి తప్పిన పచ్చదనమంతా
కాలుష్యపు కార్చిచ్చులో
కనుమరుగయిందని
చెప్పకనే
వాపోయింది
వృక్షరాజము...జాలి చూపులతో...
సంఖ్య:.85
అంశం : కోకిలమ్మ - :వై.కె.సంధ్యశర్మ
శీర్షిక : ఓ కోయిలమ్మ!
వసంత నీరీక్షణలో
మొండి మొలలతో
నిలబడ్డ వృక్షాలను
అడిగింది
ఓ కోయిలమ్మ
కానరాని పచ్చదనానికి
కారణమేమని
చివుళ్ళేయని
చిటారుకొమ్మల
నడుమ ఆకులేవని
పండు వెన్నెల్లా కాసే
ఫలాలేవని!
పక్షుల కువకువల
కూని రాగాలు
రామచిలుకల పలుకులు
కాకమ్మ కబుర్లేవని!
బుర్రుపిట్టలు తుర్రుమనే
చెట్టు తొర్రలేవని
గువ్వల గుంపుల
గూళ్ళేవని!
వయ్యారి ఉడుతల
అల్లరేదని
వడ్రంగి పిట్టల
వలపు పిలుపులేవని
వానరతోకల
కథలేవని!
గరుత్మంతుని కాలి జాడలేవని!
పావురాళ్ళ పొదరిళ్ళేవని!
కాటుక కళ్ళ కోయిలమ్మ
కన్నీరొలికింది!
గతి తప్పిన పచ్చదనమంతా
కాలుష్యపు కార్చిచ్చులో
కనుమరుగయిందని
చెప్పకనే
వాపోయింది
వృక్షరాజము...జాలి చూపులతో...
Comments
Post a Comment